యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ప్యాన్ ఇండియా సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ , కోమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్ గన్, అలియాభట్ నటిస్తున్నారు. జనవరి నెలలోనే ఈ సినిమా విడుదల చేయాల్సి ఉన్నా… కరోనా, ఓమిక్రాన్ మళ్లీ తీవ్రరూపు దాల్చడంతో విడుదలను వాయిదా వేశారు ఫిలిం మేకర్స్. సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్లు అన్ని వృథా అయ్యాయి. చెన్నై, తిరువనంతపురం, బెంగళూర్, హైదరాబాద్, ముంబైలో భారీ ఎత్తున్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇదిలా ఉంటే తాజాగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే మార్చి 17, ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో ఏదో ఓ తేదీన ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే సమ్మర్ బరిలో ట్రిపుల్ ఆర్ ను దించేందుకు సిద్ధం అవుతున్నారట మూవీ మేకర్స్. ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటికి కరోనా తగ్గి.. థియేటర్లలో 100 ఆక్యుపెన్సీతో నడుస్తాయని చిత్రయూనిట్ భావిస్తోంది.