వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్న బ్యాంకు ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ). అలాగే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు). ఏటా 15 శాతం జీతాల పెంపు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక ప్రధాన బ్యాంక్ యూనియన్ నాయకుడు మీడియాకు తెలిపారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 15 శాతం జీతం ప్రతీ ఏటా పెంచుతారు.
ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులతో సహా 37 బ్యాంకులు తమ ఉద్యోగులకు వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఐబిఎ ఆదేశాలు ఇచ్చింది. “ముంబైలో జరిగిన ఐబిఎ మరియు యుఎఫ్‌బియుల మధ్య జరిగిన సమావేశంలో విస్తృత అవగాహన కుదిరిందని, అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని” అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటచలం మీడియాకు వివరించారు. ఐబిఎ మరియు కార్మికులు మరియు అధికారుల సంఘాల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే వేతన సవరణ నవంబర్ 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.