తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 27 నుంచి 30 వరకు నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్,జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం,రాజన్న సిరిసిల్ల,నారాయణపేట, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 42 డిగ్రీలను దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీలు,చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్ 42 డిగ్రీలు నమోదవగా.. పలు జిల్లాల్లో 40కిపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.