తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి నేటితో తెర పడే అవకాశముంది. మరో సారి ఈ రోజు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. దాదాపు చర్చలు సానుకూలంగా ఉండే సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ పంపిన అన్ని ప్రతిపాదనలకు ఏపీ అంగీకరించింది. ఆ లెక్కన హైదరాబాద్ బెజవాడ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ సర్వీసులు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపేందుకు తెలంగాణ రెడీ అయింది.
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో MOU ఒప్పందం జరగవచ్చని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రోజు సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడిచే ఛాన్స్ ఉంది. నిజానికి కరోనా లాక్ డౌన్ మొదలవక ముందు అంటే జనతా కర్ఫ్యూ నుండి ఈ బస్సులు కూడా ఆగిపోయాయి. అయితే లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చినా తెలంగాణా మాత్రం బస్సులు నడిపేందుకు ఒప్పుకోలేదు. ఏపీ ఆర్టీసీ వలన తాము నష్టపోతున్నాం అనేది తెలంగాణా వాదన.