ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీపై కసరత్తు చేస్తుంది అని… ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఆదివారం సంకేతాలు ఇచ్చారు. అయితే ఇది ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. ఏ రంగానికి ఇప్పుడు సహాయం అవసరం అనే దాని మీద తాము కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే చర్యలకు దిగుతామని చెప్పారు. పరిశ్రమ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖల నుండి సలహాలను తీసుకుంటామని ఆయన అన్నారు.
వారి సూచనలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలు తెలుసుకుని సరైన సమయంలో ముందుకు వస్తామని అన్నారు. ఉద్దీపన ప్యాకేజీకి తాను కాలపరిమితి చెప్పలేను అని అన్నారు. కాని కచ్చితంగా ప్యాకేజి మాత్రం వస్తుంది అని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి గురించి మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని నిరంతర వృద్ధి వైపు పయనిస్తోందని చెప్పారు.