బిజినెస్ ఐడియా: మినరల్ వాటర్ బిజినెస్ తో అదిరే లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఈ బిజినెస్ వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఆదాయం కూడా బాగుంటుంది. మినరల్ వాటర్ బిజినెస్ ద్వారా చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

 

ఈ బాటిల్ వాటర్ వ్యాపారం ప్రతి సంవత్సరం కూడా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మినరల్ వాటర్ బాటిల్స్ ని ఇంటింటికి సరఫరా చేయొచ్చు. చాలా మంది ఈ ఐడియా ని అనుసరిస్తున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా మీరు ఉన్న ఊళ్లోనే ఈ వ్యాపారం ని ప్రారంభించవచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి అనే దాని గురించి కూడా చూద్దాం.

ఈ వ్యాపారాన్ని కనుక మీరు మొదలు పెట్టారు అంటే ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోవాలి. పాన్ నెంబర్ జిఎస్టి నెంబర్ వంటివి పూర్తి చేయాలి. అలానే లైసెన్స్ నెంబర్ తీసుకోవాలి. అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకోవాలి. ఇలా పూర్తయ్యాకే వ్యాపారం మొదలు పెడితే మంచిది. లేదంటే రిస్క్ ఉంటుంది. అలానే వాటర్ ప్లాంట్ కోసం బోరు, ఆర్వో ఫిల్టర్ లతో పాటు కొన్ని మిషన్స్ కావాలి. వీటి కోసం వెయ్యి నుంచి 1500 చదరపు అడుగుల స్థలం కావాలి.

ఈ వ్యాపారం కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవసరమవుతాయి. 20 లీటర్ల సామర్ధ్యం ఉన్న 100 వాటర్ కేన్లను కొనాల్సి ఉంటుంది కావాలంటే బ్యాంకు నుండి కూడా లోన్ తీసుకోవచ్చు. మీరు గంటకు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తిచేసే వాటర్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తే 30 వేల నుంచి 50 వేల వరకు సంపాదించొచ్చు. నెలకు లక్షా యాభై వేల వరకూ ఆదాయం వస్తుంది. ఒక మినరల్ వాటర్ బాటిల్ నీరు 25 రూపాయలకి అమ్మితే 5,000 వరకు రోజుకి వస్తాయి ఇలా మీరు ఉన్న ఊర్లోనే వాటర్ ప్లాంట్ వ్యాపారం మొదలుపెట్టి అద్భుతంగా సంపాదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news