డైలాగ్ ఆఫ్ ద డే : నిషా న‌గ‌రంలో.. విషాద ఛాయ

-

ఆక‌లి క‌న్నీళ్ల‌ను మోసిన న‌గ‌రంలో విషాదాలు.. చీక‌టి ఛాత్ర ఛాయల్లో విషాదాలు.. డ‌బ్బుంటే పేరు, పేరుంటే డ‌బ్బు.. ప‌ర‌స్ప‌ర ఆధారిత స్వ‌రాల్లో ఎన‌లేని ఖ్యాతి లేదా ఎనలేని పొగ‌రు ఎవ్వ‌రిదో ఎవ్వ‌రికో.. ప్ర‌ముఖుల పిల్ల‌లు పాపం వాళ్ల‌కేం తెలియ‌దు. వాళ్ల‌కు బెట్టింగులు రావు. వాళ్లకు కొకైన్ తెలియ‌దు. పాపం వాళ్ల‌కు ఖ‌రీదు అనుకునే మ‌త్తు పానీయాల పేర్లే తెలియ‌వు. పార్టీ క‌ల్చ‌ర్ అంటే వాళ్ల‌కు వాంతి. వాంతి చేసుకునే బ‌య‌ట ప‌డుతున్నారులేండి.. వినేందుకు మ‌న‌కు వాంతి.. తాగి తూలాక తూగాక వాళ్ల‌కు వాంతి. జీవితం ఇంత‌టి అస‌హ్యక‌ర ధోర‌ణిలో ఉండ‌డమే అస‌లు విషాదం. వీటికి విరుగుడు లేదు. భ‌రించ‌డం స‌హించ‌డం అన్న‌వి ఓ అన‌ర్థ దాయ‌కాలే ! కానీ త‌ప్ప‌వు !

పేరున్న న‌గ‌రంలో పేరున్న వ్య‌క్తులు ఏమైపోతున్నారు. పేరున్న న‌గ‌రంలో పేరున్న కుటుంబాలు ఏమ‌యిపోతున్నాయి. పేరున్న న‌గ‌రంలో మురికి ఉంది. మంచి ఉంది. దుఃఖాన్ని దాచుకున్న తీరు కూడా ఉంది అని చ‌దివేను. దుఃఖాన్ని దాచుకుంటే పెద్ద‌వాడు అయిపోతాడు అని చ‌దివేను.. నా స్నేహితుడు మాధవ్ శింగ‌రాజు రాశారీ మాట. న‌గ‌రం దుఃఖాన్ని దాచుకోవ‌డ‌మే కాదు దాటుకుని వ‌చ్చిన సంద‌ర్భాల్లో నేనున్నాను. క‌న్నీళ్ల‌ను దాచుకున్న సంద‌ర్భాల్లో నేనున్నాను అని చెప్ప‌గ‌లిగే ప్ర‌క‌టించ‌గ‌లిగే స్థితి ఎందరిదో! ఎంద‌రికో కూడా!

ఒక ఛాయ్ ఒక బిస్కెట్ రెండు మూడు స‌మోసాలు ఆ పూట ఆక‌లిని తీర్చి కొత్త జీవితాన్ని ఇచ్చాయి ఎంద‌రికో ! న‌గ‌రంలో రాత్రి వేళ జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. అభ‌ద్ర‌త‌ల‌ను మోసుకుని అన్యాయం అయిపోతున్నాయి. గ‌గ్గోలు పెడుతుంటే అరుస్తుంటే ఆ అరుపు ఎవ్వ‌రినీ చేర‌డం లేదు. మీ బిడ్డ‌లకు మీరు ఏం నేర్పుతున్నారో మీకు తెలుస్తుందా? అవును మేం త‌ప్పులు చేయ‌లేదు అని రాస్తే చెబితే ప‌లికిస్తే ప‌లికితే అవన్నీ నిజాలే అవుతాయా? గ‌తంలోనూ ఇలానే ప‌లికారు. ఇప్పుడు కూడా ప‌లుకుతూనే ఉండండి. మీ చిల‌క పలుకులకు ఆస్థాన జ్యోతిష్యులు అయినా అర్థం చెబుతారేమో చూద్దాం!

Read more RELATED
Recommended to you

Latest news