ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే కుటుంబానికి ఆర్థిక సాయంగా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే. ఇన్సూరెన్స్ పాలసీ మన దగ్గర డబ్బులు లేని సమయంలో బాగా ఉపయోగపడుతుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. బ్యాంకు నుంచి తీసుకునే వ్యక్తిగత రుణం కంటే ఇన్సూరెన్స్ పాలసీపై తీసుకునే వ్యక్తిగత రుణాలకు వడ్డీ తక్కువ ఉంటుంది. ఆరు నెలలో చెల్లించే మొత్తానికి ప్రస్తుతం 9 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. అదే ఒకవేళ ఆరు కంటే ముందే చెల్లించేస్తే అప్పుడు ఆరు నెలలకే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్ పాలసీని ఆధారంగా చేసుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ లోన్స్ ని ఇస్తున్నాయి. ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై 80 శాతం నుంచి 90 శాతం వరకు లోన్స్ ని జారీ చేయడం జరుగుతుంది.
కనీసం రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు వలన ఇవే లాభాలు కలగవు. కనుక మీరు తొలుత మీ పాలసీ వ్యక్తిగత రుణం తీసుకునేందుకు అర్హత కలిగి ఉందో లేదో చూసుకోండి. వరుసగా మూడేళ్లు పాటు ప్రీమియాలు చెల్లించిన వారికి మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలపై లోన్స్ కి అనుమతి ఇస్తున్నాయి.