బిజినెస్ ఐడియా: లక్షల్లో ఆదాయాన్ని తీసుకొచ్చే CNG ప్లాంట్..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక బిజినెస్ ఐడియా. వ్యవసాయ-రంగ సహకార సంస్థ అయిన నాఫెడ్ వ్యవసాయ వ్యర్థాల నుండి BIO CNG ను ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా 100 ప్లాంట్లను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

CNG
CNG

అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రూ .5 వేల కోట్ల పెట్టుబడితో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మీరు బయో CNG ప్లాంట్‌ను స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. ఆవు, గేదె, ఇతర పశువుల పేడతో పాటు, కుళ్ళిన కూరగాయలు, పండ్ల నుండి BIO CNG తయారవుతుంది. దీని ద్వారా ఆవు పేడను శుద్ధి చేయడం ద్వారా మీథేన్ తయారవుతుంది. దీని తరువాత, మీథేన్ కుదించి సిలిండర్‌లో నింపబడుతుంది. ఇలా సంపాదించచ్చు.

పైగా డిమాండ్ కూడా ఎక్కువే. ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న వారు బయో సిఎన్‌జి సరఫరా సిలిండర్ల ద్వారా చేస్తారు. ఇది వారి ఇళ్లలో సరఫరా చేసే ఎల్‌పిజి సిలిండర్‌తో సమానంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఆ మిగిలిన పేడ ఎరువులుగా వాడచ్చు.  ప్లాంట్ నుండి బయో సిఎన్‌జిని కొనుగోలు చేయడానికి ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు NAFED మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కె చాధా తెలిపారు. దీని కోసమే యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో మొదటి దఫాలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news