బిజినెస్ ఐడియా: దోస సాగుతో లాభాలే లాభాలు..!

ఈరోజుల్లో వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయని ఉద్యోగాలని కూడా కాదనుకుని చాలా మంది వ్యాపారాలను చేస్తున్నారు మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడాల్సిందే. ఈ ఐడియా ని కనుక ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

దోసకాయల సాగు ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ దోస మంచి లాభాలని తీసుకొస్తుంది. మీరు ఈ సాగు చేయడానికి ఇసుక లోమి నేలలని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలానే ఆరు నుండి ఏడు పీహెచ్ లెవెల్స్ ఉండేటట్టు చూసుకోవాలి అధిక ఉష్ణోగ్రత లో సాగుచేస్తే దిగుబడి బాగా ఎక్కువ ఉంటుంది అని నిపుణులు అంటున్నారు.

మీరు దోసకాయలని నదులు చెరువులు పక్కన కూడా పండించొచ్చు. పైగా ప్రభుత్వం కూడా దోస సాగు కోసం సహాయం ఇస్తోంది. దోసకాయ పంట 60 నుండి 80 రోజుల్లోనే చేతికి వచ్చేస్తుంది. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక రైతు అయితే దోస సాగు ద్వారా నెలకు ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు.

మీరు దీని కోసం కీరా దోస విత్తనాలను తీసుకురావాల్సి ఉంటుంది అలానే జాగ్రత్తగా సాగు చేస్తూ వచ్చిన పంటని మార్కెట్ కి తీసుకువెళ్లి అమ్మాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని తీసుకు వచ్చే పంట ఇది. ఎకరాకు 50 వేలు ఖర్చు అయితే మీకు 70 క్వింటాల్ పంట చేతికి వస్తుంది. క్వింటాల్ కి 1000 నుంచి 2000 వరకు వస్తుంది. 1500 రూపాయలు కనీసం వచ్చినా సరే లక్షకు పైగానే వస్తాయి. ఎకరాకు 50 వేల నికర లాభం కీరదోస పంట తో మీకు వస్తుంది.