బిజినెస్ ఐడియా: ఐస్ క్రీమ్ పార్లర్ తో అదిరే లాభాలు..!

-

వ్యాపారాలను చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం కోసం చూస్తుంటే ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు. ఈ ఐడియా ని అనుసరించడం వలన చక్కటి లాభాలను పొందడానికి అవుతుంది ఇక ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఐస్ క్రీమ్ పార్లర్ కూడా బాగుంటుంది.

ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎటువంటి రిస్క్ ఉండదు. నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు.

వేసవి రోజుల్లో అయితే ఐస్ క్రీమ్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు కనుక బాగా బిజినెస్ అవుతుంది. ఇక ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాన్ని చూస్తే… పది వేల నుండి 20 వేల రూపాయల వరకు ఐస్ క్రీమ్ పార్లర్ ని మొదలు పెట్టడానికి ఖర్చు అవుతాయి. అయితే ఇది పూర్తిగా మీ ఇష్టం.

మీరు ఎంత పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే అంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైనా ఒక షాప్ ని అద్దెకి తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ ని మొదలు పెట్టొచ్చు. 300 నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడానికి అవుతుంది.

మీరు ఈ బిజినెస్ కోసం పెద్దగా కష్టపడకండి మొదట అయిదు నుండి పది మందికి సీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత మీరు దీనిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు రిస్క్ ఉండదు కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news