ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఆ మధ్య ఓ మంత్రి పేరుతో ఆడియో బయటకు వచ్చింది. తాజాగా మరోసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఆడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. దీనిపై ఇంకా ఆయన స్పందించలేదు. ఈ ఆడియో పై స్పష్టత లేదు. కానీ అవంతి, శ్రీనివాస్ పేరుతో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
తాజాగా బయటకు వచ్చిన ఆడియోలో లవ్ యు బంగారం, ఎప్పుడూ నిద్రేనా అని ఆడియో వినిపిస్తోంది. మనం మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందని అడగగా, 15 రోజులకు పైగానే అని మరోవైపు నుంచి సమాధానం వస్తుంది. ఇందులో భాగంగానే లవ్ యు డార్లింగ్ అంటూ మరోసారి చెప్పే మాటలు వినిపిస్తాయి. ఈ ఆడియోను నెటిజన్లు సైతం షేర్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఆడియోను వైరల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ రకాల ట్విట్టర్ అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నారు.