ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మంచిగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఉద్యోగస్తులు కూడా వ్యాపారాల పై మక్కువ చూపిస్తున్నారు. మీరు కూడా వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా..? ఏదైనా మంచి వ్యాపారం కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. మీరు కూడా ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఒక అతను గులాబి పూలు సాగు చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. నిజానికి ఇక్కడ వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మైళ్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలి. అయినప్పటికీ రైతు ఎంతో కష్టపడి మంచి ఫలితాలను పొందుతున్నారు. 1989వ సంవత్సరంలో ఒక రైతు చేసిన గులాబీ పంట ప్రయత్నాన్ని ఇప్పుడు ఉన్న రైతులు కూడా తెలుసుకున్నారు.
దీనికి నీటి అవసరం చాలా తక్కువ అందుకని చాలా మంది రైతులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. కుండలి కుమార్ కూడా 0.5 ఎకరాల భూమిలో రసాయన పద్ధతులతో వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. దీనివల్ల కిలోకి నాలుగు రూపాయల ధర లభించింది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు 15 రూపాయల వరకూ పెరిగిందని చెప్పారు. ఇలా వంద ఎకరాల్లో గులాబీ సాగు చేయడం మొదలుపెట్టారు.
పట్టణాలకు కూడా గులాబీలని పంపిస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. క్రమంగా గులాబీ విస్తీర్ణం మూడు వందల ఎకరాలకు చేరింది పూలు మాత్రమే కాకుండా రోజ్ వాటర్, గుల్కన్డ్, ఎసెన్స్ ఇతర ఉత్పత్తులను కూడా సేల్ చేస్తున్నారు. వీటిని శిక్షణ తీసుకొని అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇలా గులాబీలతో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఈ రైతులు.