ఒక్క క్షణం కూడా కరెంట్ పోకూడదు.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం

-

రాబోయే వేసవి కాలంలో డిమండ్ మేరకు విద్యుత్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో SPDCL పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్.. రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.

క్షేత్ర స్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది చాలా సున్నితమైన అంశం, నిత్యవసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వేసవి ప్రణాలికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెంటనే సమావేశం నిర్వహించుకొని క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు. వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version