మీరు ఏదైనా వ్యాపారం ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయితే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అస్సాం కు చెందిన దీపాలి భట్టాచార్య పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు ఈమె ప్రకృతి అనే పేరుతో పచ్చళ్ళు, స్నాక్స్ బిజినెస్ ని మొదలు పెట్టారు.
25 రకాల పచ్చళ్లు మరియు స్నాక్స్ ని కూడా ఈమె తయారు చేసి దేశ వ్యాప్తంగా అమ్ముతున్నారు. సంవత్సరానికి దాదాపు ఐదు లక్షల వరకు ఈమె సంపాదిస్తున్నారు. 2003లో ఒక దీపాళి భట్టాచార్య భర్త గుండె పోటుతో మరణించారు.
అయితే ఈమెకి మొదటి నుంచి వంట అంటే బాగా ఇష్టం. దాంతో ఆమె పచ్చళ్ల వ్యాపారం ని మొదలు పెట్టాలి అనుకున్నారు. 2015లో ప్రకృతి ని స్టార్ట్ చేశారు. ప్రకృతి పేరు తో ఈ బిజినెస్ ని మొదలు పెట్టగా ఇప్పుడు చక్కగా రాబడి వస్తోంది.
ఆమె తయారు చేసే ఏ పచ్చడి అయినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. దీనితో డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఎంతో రుచిగా ఈమె తయారు చేసి అమ్ముతూ ఉంటారు. పదివేల తో మొదలు పెట్టిన ఈ బిజినెస్ కి ఇప్పుడు లక్షల్లో లాభాలు వస్తున్నాయి.