Big Boss Non Stop: ‘బిగ్ బాస్’లో బూతులు మాట్లాడేది ఎవరు..శివకు నాగార్జున ఇచ్చిన శిక్ష ఇదే

-

తెలుగు పాపులర్ రియాలిటీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఆరో వారంలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ పైన ఎన్నడూ లేని విధంగా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.నటరాజ్ మాస్టర్ ను ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ..బూతులు మాట్లాడే హౌజ్ మేట్ ఎవరు? అని అడిగారు.

నాగార్జున ప్రశ్నకు నటరాజ్ మాస్టర్ సమాధానమిచ్చేందుకు హౌజ్ లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారను. ఇంతలో అషురెడ్డి వైపు వెళ్లినట్లు ప్రోమోలో స్పష్టమవుతోంది. అలా పచ్చి బూతులు మాట్లాడేది అషురెడ్డినేనని నటరాజ్ మాస్టర్ చెప్పారు. దాంతో వామ్మో మా అమ్మకు ఈ విషయం తెలిస్తే దబిడే దిబిడే అన్నట్లు అషురెడ్డి ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది.

ఇంతలో లేజియెస్ట్ హౌజ్ మేట్ ఎవరు అని నాగార్జన మరో కంటెస్టెంట్ ను అడిగారు. వీడియో ప్లే చేయాలన్న నాగార్జున ఆదేశాల మేరకు నిర్వాహకులు వీడియో ప్లే చేశారు. అందులో శివ బాత్ రూమ్ లో ఏదో చేసినట్లు చూపించారు. అలా లేజియెస్ట్ పని శివది అని ప్రూవ్ చేశారు.

ఈ విషయమై బిందు మాధవి సైతం ఒప్పుకుంది. శివ చేసింది తప్పేనని తెలిపింది బిందు మాధవి. అలా శివను టార్గెట్ చేశారు. అయితే, అదంతా జోక్ అని శివ చెప్పబోతుండగా నాగార్జున సీరియస్ అయ్యారు. షటప్ అని అరిచేశారు. ప్రతీ దానని నవ్వులాట చేస్తే నువ్వు నవ్వుల పాలు అవుతాయని శివను హెచ్చరించడంతో పాటు వారం రోజుల పాటు అమ్మాయిల బట్టలన్నీ ఉతకాలని పనిష్ మెంట్ ఇచ్చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version