బిజినెస్ ఐడియా: విద్యార్థులు ఖాళీ సమయంలో ఇలా డబ్బులు సంపాదించుకోచ్చు..!

-

ఈ మధ్యకాలంలో విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. కనీసం పాకెట్ మనీ వచ్చినా సరే ఖర్చులకి ఉపయోగపడుతుందని సంపాదించడానికి మార్గాల కోసం చూస్తున్నారు. అయితే చదువుకుంటూ మీరు కూడా సంపాదించాలని అనుకుంటున్నారా..? ఇదేం పెద్ద కష్టం కాదు.

ఈ విధంగా మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బుతో మీరూ పుస్తకాలను కానీ సరదాగా ట్రిప్ వంటివి వేయడం గానీ చేయొచ్చు. పైగా పాకెట్ మనీ కోసం మీ తల్లిదండ్రులు మీరు డబ్బులు అడగక్కర్లేదు. అయితే ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఫుడ్ సెంటర్:

మీరు కాస్త డిఫరెంట్ గా ఉండే ఆహార పదార్థాలను తయారు చేసి అమ్మచ్చు. ఉదాహరణకి ఐస్ క్రీమ్ దోస, బటన్ ఇడ్లీ ఇలాంటివి రుచికరంగా తయారుచేసి ఖాళీ సమయంలో అమ్మొచ్చు. అయితే ఈ వ్యాపారం చేయాలంటే కాస్త సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయి.

ఆన్లైన్ కోచింగ్ సర్వీస్:

ఇది కూడా మీకు ఖాళీ సమయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి మంచి మార్గం. మీకు నచ్చిన సబ్జెక్టు మీరు చెప్పి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మొదట మీరు ఒకరిద్దరు నుంచి మొదలుపెట్టి క్రమంగా దానిని విస్తరించుకోవచ్చు. తద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకుని వాటిని సేవ్ కూడా చేసుకోవచ్చు.

కంటెంట్ రైటింగ్:

కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా వెబ్ సైట్లు ఫ్రీలాన్సర్స్ ని తీసుకుంటున్నారు. ఇలా మీరు మీకు ఖాళీ ఉన్నప్పుడు రాసి డబ్బులు సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు.

ఈవెంట్ మేనేజ్మెంట్:

చాలా మంది విద్యార్థులు ఈ మధ్య ఈవెంట్ మేనేజ్మెంట్ కి కూడా వెళుతున్నారు. దీనికోసం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలానే మోటివేట్ చేస్తూ ఉండాలి. మీకు కనుక ఈ స్కిల్స్ ఉంటే కచ్చితంగా మీరు ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news