మామూలుగా ప్రియమైన వారికి కొన్ని విలువైన గిఫ్టులు ఇస్తూ ఉంటారు చాలామంది. సాధారణంగా కాకుండా ఎంతో ప్రత్యేకంగా ఉండేలా బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ భర్త భార్యకు పుట్టినరోజు నాడు ఇచ్చిన బహుమతి మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు అని చెప్పాలి. అసలు ఇలాంటి బహుమతి కూడా ఇవ్వచ్చా అనే కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడు అని అంటారా. ఏకంగా చంద్రుడు పైన ఒక ఎకరం స్థలం కొనుగోలు చేసి భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు.
పాకిస్థాన్కు చెందిన సోహెల్ అహ్మద్ అనే వ్యక్తి… తన భార్య పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అయితే సాధారణమైనది కాకుండా ఎంతో ప్రత్యేకమైనది బహుమతి ఇస్తే బాగుంటుందని భావించాడు. చంద్రుడిపై ఎకరా స్థలం కొనుగోలు చేశారు. సి ఎఫ్ వేపర్ అనే ప్రదేశంలో 3300 రూపాయలు వెచ్చించి చంద్రుడిపై స్థలం కొనుగోలు చేశారు. ఇంటర్నేషనల్ ల్యూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ నుండి స్థలానికి డాక్యుమెంట్ అందగానే భార్య పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చాడు.