సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను కరోనా టీకా వేయించుకోనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బిజెపి వ్యాక్సిన్‌ను తాను నమ్మలేనని, తన ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు అందరికీ ఉచిత టీకాలు అందజేస్తామని చెప్పారు.
“నేను ప్రస్తుతం టీకాలు వేయించుకోవడం లేదు. బిజెపి వ్యాక్సిన్‌ను నేను ఎలా విశ్వసించగలను, మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ లభిస్తుంది. మేము బిజెపి వ్యాక్సిన్ తీసుకోలేము. ” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. COVID19 వ్యాక్సిన్‌ను భారతీయులందరికీ ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పిన కొన్ని గంటల తర్వాత అఖిలేష్ ఈ ప్రకటన చేశారు. COVID-19 వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వబడుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు, “ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇది ఉచితం” అని వర్ధన్ సమాధానం ఇచ్చారు.