క్యాబేజీ తింటే కరోనా వస్తుందా…?

-

కరోనా వైరస్ ఏమో గాని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తుంది సోషల్ మీడియా. పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా క్యాబేజీ తింటే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా చేసారు. క్యాబేజీ ఆకులపై కరోనా వైరస్ రోజుల తరబడి బ్రతుకుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇందులో నిజం లేదని స్పష్టంగా చెప్పింది. ప్రెస్ ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ న్యూస్ (PIB) దీనిపై కథనం రాసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు స్పష్టంగా సూచనలు చేసింది. ప్రజలు అసలు ఆందోళన చెందవద్దు అని పేర్కొంది. మిగతా కూరగాయల ఎలా అయితే వేడి నీళ్ళతో కడుగుతారో… క్యాబేజీ కూడా కొన్న తర్వాత వేడి నీటిలో కడగాలని సూచించారు.

ఆ తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని… ఆ తర్వాత క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసుకొని, బాగా ఉడికించుకోవాలని సూచిస్తున్నారు. సగం ఉడికిన క్యాబేజీని తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల రైతులు ఇలాంటి తప్పుడు ప్రచారాల కారణంగా భారీగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు మరింత మంది రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news