మోడీ గారూ కొవ్వొత్తులు వెలిగించడం వెనుక అర్ధం ఏంటీ…?

-

దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియా ముందుకి వచ్చి ఒక కీలక ప్రకటన చేసారు. దేశంలో కరోనా వైరస్‌ను తగ్గించేందుకు, ప్రజల్లో ధైర్యం, ఐక్యతాభావాన్ని పెంచేందుకూ… ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా ఒక పని చెయ్యాలని సూచించారు.

9 నిమిషాలపాటూ అందరూ కూడా దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల వంటివి ఆన్ చేయ్యాలనీ, ఆ సమయంలో కరెంటు లైట్లు ఆర్పివేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. దేశ ఐక్యత చాటితే కరోనా తగ్గుతుంది, చీకట్లు తరిమి వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మందికి దాని వెనుక అర్ధం ఏంటో అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు.

చాలా మందిలో దీనిపై అసహనం ఉంది. కరోనా వైరస్ పై పోరాడాలి అంటే ప్రజలకు వైద్య సదుపాయాలు పెంచాలి గాని కొవ్వొత్తులు వెలిగిస్తే కరిగిపోవడం మినహా మరో మార్గం లేదని దీని వలన వచ్చే ఉపయోగం ఏ విధంగాను లేవని, ప్రాణాలు కాపాడే వైద్యులు ప్రాణ భయంతో ఉన్నారని, వాళ్లకు సరైన పరికరాలు లేవని దాని మీద దృష్టి పెడితే మంచిది అంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news