తెలంగాణాలో ప్రత్యేక కరోనా ఆస్పత్రి…!

-

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా నిన్న 75 కేసులు పెరగడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు విషయంలో సుధీర్గ చర్చలు జరుపుతున్నారు. కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనితో ఆయన భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరించాలి, ఏయే పరిణామాలను తెలంగాణా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద చర్చలు జరుపుతున్నారు.

కరోనా మహమ్మారి కేసీఆర్ అంచనాలను దాటేసింది. కొత్త కేసులు రావు అనుకున్న తరుణంలో నిన్న ఒక్క రోజే అన్ని కేసులు నమోదు కావడంతో తెలంగాణాలో కలవరం మొదలయింది. ఇప్పుడు కేసీఆర్ ఈ విషయంలో ఏ మాత్రం కూడా అలసత్వం వద్దని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన దాదాపు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటూ ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ముందుకి వెళ్తున్నారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణాలో అవసరం అయితే కరోనా కోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మాణం చేసే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. ఇప్పటికే ఆర్ధిక శాఖతో దీనికి సంబంధించిన చర్చలను కూడా ఆయన జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. తెలంగాణాలో కేసులు ఇంకా పెరిగితే ఇబ్బంది రాకుండా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఆస్పత్రి నిర్మాణం విషయంలో ముందుకి వెళ్ళే ఆలోచన చేస్తుంది.

దీనిపై ఇప్పటికే కేంద్రానికి కూడా కేసీఆర్ సమాచారం ఇచ్చారని, హైదరాబాద్ శివారుల్లో దీనికి ఆస్పత్రి నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గాని దీనిపై మాత్రం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కరోనా ఆస్పత్రిగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరో నాలుగు ఆస్పత్రుల విషయ౦లో ఇదే చెయ్యాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news