ఇదేదో బాగుందండోయ్‌.. ఎంపీల కోసం ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్..

-

దేశంలోని ఎంపీల కోసం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. ఎంపీల రవాణా బిల్లుల క్లియరెన్స్‌ ఎంత దాకా వచ్చిందీ, లేక అదనపు భత్యాలేవైనా వస్తాయా, కీలక బిల్లులకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ మెటీరియల్‌, పార్లమెంట్‌ సమావేశాల వివరాలు, గత సమావేశాల చర్చలు, తాము వేసిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం… ఇలా సకల వివరాలూ ఆ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తెలియజేసుకోవచ్చు.

ఇందుకోసం పార్లమెంటు అనుబంధ భవనంలోని 13వ గదిని కేటాయించి ముగ్గురు అధికారులు, ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా పార్లమెంటు సభ్యులు తమకు అవసరమైన సకల సమాచారాన్ని పొందవచ్చు. మెయిల్‌ ద్వారా అన్నీ తెప్పించుకోవచ్చు. స్పీకర్‌ ఓం బిర్లా ప్రయోగాత్మకంగా గత నెలలో చేపట్టిన ఈ కాల్‌ సెంటర్‌ విధానం.. ఇపుడు పూర్తిస్థాయి సమాచార కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version