కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా…. బాలినేని

-

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ కాల్ లీక్ కావడం తెలిసిందే. ఈ మేరకు వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీలోకి పోవాలనుకునేవాళ్లే ఇలాంటివి చెబుతారని విమర్శించారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని అన్నారు. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డు చేశాడని, కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడని బాలినేని వెల్లడించారు.

Balineni welcomes CM's plan to replace entire cabinet

ఇక, కోటంరెడ్డి సోదరుల మధ్య తాము ఎలాంటి చిచ్చుపెట్టలేదని, ఆ అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ ఇన్చార్జి పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు కోరాడని, అయితే కోటంరెడ్డితో ఆ విషయం మాట్లాడుకోవాలని సూచించామని బాలినేని స్పష్టం చేశారు.మంత్రి పదవి జిల్లాకు ఒకరికే దక్కుతుందని, ఐదారుసార్లు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని వివరించారు. పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారని బాలినేని నిలదీశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news