చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మారుస్తారా… కోర్ట్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో శనివారం రోజున అరెస్ట్ చేసి నిన్న ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టడంతో వాద ప్రతివాదనలు వేడి వేడిగా సాగిన తర్వాత.. ఏసీబీ కోర్ట్ చంద్రబాబు ను 14 రోజుల పాటుగా జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. ప్రస్తుతం చంద్రబాబు జైలు లో ఉన్నారు.. రిమాండ్ ప్రకారం సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఈ జైలులోనే ఉండే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్లు ఈయనకు జ్యూడిషియల్ రిమాండ్ నుండి మినహాయింపును కలిగిస్తూ హౌస్ అరెస్ట్ గా మార్చాలని పిటిషన్ ను వేశారు. కాగా ఈ పిటిషన్ పై సాయంత్రం 4 .30 గంటలకు విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పును తెలియచేయనుంది. ఈ పిటిషన్ లో చంద్రబాబు తరపున లాయర్లు మా క్లయింట్ కు కోర్ట్ లో ప్రాణహాని ఉందని లాయర్… లూథ్రా వాదించగా, ఈ విషయంపై సీఐడీ తరపున లాయర్ పొన్నవోలు రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుందని కోర్టుకు విన్నవించుకున్నారు.

ఈ పరిస్థితుల్లో అందరూ ఎంతో ఆసక్తిగా కోర్ట్ ఏమి తీర్పును ఇస్తుందో అని వేచి చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news