చంద్రబాబు అరెస్ట్ అవడంతో… 101 కొబ్బరి కాయలు కొట్టిన వ్యక్తి !

-

నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈయన టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా నిధులను దారి మళ్లించారన్న కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. కాగా ప్రస్తుతం చంద్రబాబు 14 రోజుల రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇక చంద్రబాబును బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు, లాయర్లు మరియు బడా వ్యాపారవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ ను పండుగ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో 101 కొబ్బరి కాయలు గుడిలో మొక్కును తీర్చుకున్నాడట. ఇతను గతంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే 101 కొబ్బరి కాయలు కొడతానని మొక్కు కున్నాడు అని తెలుస్తోంది. ఆ మొక్కులో భాగంగానే ఈ రోజు దేవుని గుడిలో ఇలా చేశాడట.

పైగా చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు గాను సీఎం వైఎస్ జగన్ కు థాంక్స్ అంటూ చెప్పాడు. ఈ విషయం ప్రస్తుతం సోసిల్ మీడియాలో వైరల్ గ మారింది.

Read more RELATED
Recommended to you

Latest news