US OPEN విజేతగా నోవాక్ జొకోవిచ్… ఫైనల్ లో మేద్వేదేవ్ చిత్తు !

-

ఈ రోజు అర్ధరాత్రి యుఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్ లో భాగంగా వరల్డ్ నెంబర్ 2 నోవాక్ జొకోవిచ్ మరియు మూడవ ర్యాంక్ కు చెందిన డేనియల్ మేద్వేదేవ్ ల మధ్య భీకరంగా సాగుతుందనుకున్న ఫైనల్ కాస్తా ఏకపక్షముగా మారిపోయి టైటిల్ ను జొకోవిచ్ ఎగరేసుకుపోయాడు. మొత్తం 24 సార్లు గ్రాండ్ స్లాం ఫైనల్ కు దూసుకువెళ్లిన జొకోవిచ్ ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటాడు. ఈ గ్రాండ్ స్లాం విజయంతో తన ఖాతాలో 24 గ్రాండ్ స్లాం టైటిల్ లను అందుకున్నాడు. జొకోవిచ్ ప్రత్యర్థి అయిన మేద్వేదేవ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి సెట్ ను 6 – 3 తేడాతో గెలుచుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ సెట్ మాత్రమే టై బ్రేక్ కు వెళ్ళింది, టై బ్రేక్ లోనూ విజయం ఇరువురి మధ్యన చాలా సేపు దోబూచులాడింది.. కానీ జొకోవిచ్ అనుభవం ముందు మేద్వేదేవ్ నిలవలేకపోయాడు..

ఈ సెట్ ను 7 – 6 తో జోకో గెలిచాడు. ఇక మూడవ సెట్ లో ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు.. త్వరత్వరగా జొకోవిచ్ బ్రేక్ పాయింట్ లను దక్కించుకుని మేద్వేదేవ్ ను 6 – 3 తేడాతో ఓడించి సెట్ ను మరియు మ్యాచ్ ను కైవశం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news