యోనో ఎస్‌బీఐలో ఎంపిన్‌ ఇలా మార్చుకోండి!

-

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించే బ్యాంకింగ్‌ సేవలు అత్యధికంగా యోనో ఎస్‌బీఐ యాప్‌లోనే లభిస్తున్నాయి. అందుకే ఎక్కువ శాతం ఎస్‌బీఐ వినియోగదారులు యోనో ఎస్‌బీఐ యాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని పొందుతున్నారు. ఎస్‌బీఐ వినియోగదారులు ఎవరైనా యోనో యాప్‌లో రిజిస్టర్‌ కావొచ్చు.
యోనో యాప్‌లో రిజిస్టర్‌ అయ్యే సమయంలో ప్రతీసారి యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఆరు అంకెల ఎంపిన్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.

అయితే, ఎంపిన్‌ క్రియేట్‌ చేస్తే .. మార్చే అవకాశం ఉండదేమోనని యోనో ఎస్‌బీఐ వినియోగదారులు అనుకుంటారు. 6 అంకెల ఎంపిన్‌ను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు.
ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్‌లో ఎంపిన్‌ ద్వారా లేదా నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ కావాలి. ఆ తర్వాత ఎడమవైపు సర్వీసెస్‌ రిక్వెస్ట్స్‌ పైన ఎంపిక చేసి లేదా క్విక్‌ లింక్స్‌ కింద సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ ట్యాప్‌ చేయాలి. అందులో ‘మేనేజ్‌ పిన్‌’ పైన క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఛేంజ్‌ ఎంపిన్‌ క్లిక్‌ చేయాలి. నెట్‌బ్యాంకింగ్‌ ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కన్ఫామ్‌ బటన్‌ పైన క్లిక్‌ చేయాలి.

తర్వాత మీ ప్రస్తుత ఎంపిన్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత కొత్త ఎంపిన్‌ క్రియేట్‌ చేయాలి. మరోసారి కొత్త ఎంపిన్‌ ఎంటర్‌ చేసి కన్ఫామ్‌ చేస్తే చాలు. ఎంపిన్‌ క్రియేట్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news