బిజినెస్ ఐడియా: లక్షల్లో లాభాలను తెచ్చే కుంకుమపువ్వు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎక్కువ రాబడి కూడా దీని నుండి వస్తుంది. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం.

కుంకుమ పువ్వు ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు నెలకు మూడు నుండి ఆరు లక్షల వరకు సంపాదించుకోవడానికి అవుతుంది. చాలామంది ప్రస్తుతం కుంకుమ పువ్వు ని పండిస్తున్నారు పైగా ప్రభుత్వం నుంచి మీరు కావాలంటే సహాయం తీసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుంకుమపువ్వు.

బంగారం తో సమానంగా దీనిని చూస్తారు. కాశ్మీర్ లో ఇది ఎక్కువగా పండుతుంది. అయితే కుంకుమపువ్వు మీరు పండించాలంటే పొడి నేల కావాలి. ఇసుకతో కూడిన పొడి నేల దీనికి అనుకూలం. ఇటువంటి నేల ఉంటే కచ్చితంగా కుంకుమ పువ్వు ని పండించవచ్చు. మన ఇండియాలో కుంకుమపువ్వు కిలో 2.5 లక్షల నుండి 3 లక్షల రూపాయలు ఉంది. విత్తనాలు కావాలంటే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

జూలై నుండి ఆగస్టు వరకు కొండ ప్రాంతాలలో కుంకుమపువ్వు పండించడానికి అనుకూలంగా ఉంటుంది మైదాన ప్రాంతాల వారు ఫిబ్రవరి నుండి మార్చి మధ్య విత్తనాలు నాటుతారు కుంకుమ పువ్వు సాగు కి సూర్యకాంతి అవసరం. సముద్రమట్టానికి 1500 నుంచి 2500 మీటర్ల ఎత్తులో కుంకుమ పువ్వు సాగు చేయడానికి బాగుంటుంది. చలికాలం వర్షాకాలంలో సాగు చేయలేము. ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు కుంకుమ పువ్వుని పండిస్తే కచ్చితంగా మూడు లక్షల వరకు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news