పోస్టాఫీసు ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. చాలా మంది ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టాలని చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ కోసం చూడాల్సిందే. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీరు పొందొచ్చు.
సురక్షితమైన పెట్టుబడితో మంచి లాభాలను పొందాలని అనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ని తీసుకు వచ్చింది. దీనితో చక్కటి లాభాలు పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ 5.80 శాతం వడ్డీని ఇస్తోంది. రూ.100 నుంచి ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో ఏడాది, రెండేళ్ళు లేదా ఐదు సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ప్రతి నెలా వడ్డీ వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలంటే దగ్గర లో వున్న పోస్టాఫీసుకు వెళ్లి డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టారంటే మొత్తం 16 లక్షల కంటే ఎక్కువ వస్తాయి.
ప్రతి నెలా 10 వేలు డిపాజిట్ చేస్తే ఏడాదికి లక్షా 20 వేల రూపాయలు వస్తాయి. ఇలా మీకు ఈ స్కీమ్ కింద 10 సంవత్సరాలలో సుమారు 12 లక్షల వస్తాయి. వడ్డీ రూపంలో 4 లక్షల 26 వేలకు పైగానే వస్తాయి. అంటే పదహారు లక్షలు పైనే వస్తాయి. ఈ స్కీమ్ లో 18 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు.