పాన్ కార్డు మనకి వున్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఒకటి. పాన్ కార్డు చాలా వాటికీ అవసరం. అయితే పాన్ కార్డు ని ఆధార్ కార్డు ఆధార్‌తో లింక్ చెయ్యడం తప్పని సరి. ఇప్పటికి ఇంకా లింక్ చెయ్యకపోతే లింక్ చేసుకోండి. నిజానికి ఈ గడువు ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఇప్పుడు ఫైన్ చెల్లించి లింక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఆధార్ తో పాన్‌ను లింక్ చెయ్యాలంటే ఇప్పుడు రూ. 1000 జరిమానా ని కట్టాల్సి వుంది. కానీ ఇప్పుడు ఫైన్ తో లింక్ చేసే సదుపాయం కూడా మార్చి 31వ తేదీతో ముగియనుంది. కనుక ఇంకా లింక్ చెయ్యకపోతే లింక్ చేసుకోండి. ఈ విషయం పై ఐటీ శాఖ మరో సారి వినియోగదారులను అలెర్ట్ చేయడం జరిగింది.
ఒకవేళ కనుక గడువు తేదీ దాటిపోతే ఆధార్ కార్డు తో లింక్ అవ్వని పాన్ కార్డులు చెల్లవట. కనుక లింక్ చేసుకోండి. లేదంటే పాన్ చెల్లదు. మార్చి 31నాటికి కూడా ఆధార్‌తో పాన్‌ను లింక్ చేసుకోకపోతే అప్పుడు మీ పాన్ దేనికి పని చెయ్యదు. బ్యాంక్ అకౌంట్ కోసం డీమ్యాట్ అకౌంట్ కోసం ఇలా పాన్ వలన చాలా లాభాలు వున్నాయి. కనుక మార్చి 31 లోగా మీ పాన్ ని ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవడం మంచిది.