ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే.. ప్రతీ నెలా రూ.3 వేలు..!

-

కేంద్రం ఇప్పటికే చాలా స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. ప్రతి నెలా రూ. 3 వేలు ని ఇలా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్‌ను ఒకటి అందుబాటు లోకి తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ పేరు శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్ తో చాలా చక్కటి లాభాలని పొందొచ్చు.

ఈ స్కీమ్ కింద ఏటా రూ. 30 వేలు వస్తాయి. అయితే ఇది అసంఘటిత రంగంలోని కార్మికులకు మాత్రమే. వీధి వ్యాపారులు, రిక్షా తోలే వారు, తయారీ రంగంలోని కార్మికులు, ఇతర రంగాల్లోని కార్మికులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ స్కీమ్ లో చేరచ్చు. ప్రత్యేకమైన పోర్టల్‌ను అందుకు అందుబాటులో వుంది. ఈ స్కీమ్ లో చేరాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

ఎవరు అర్హులన్నది చూస్తే… 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయస్సు వారు దీనిలో చేరవచ్చు. ప్రతి నెలా స్వల్ప మొత్తం లో డబ్బులు కట్టాల్సి వుంది. నెలకు రూ. 55 నుంచి దీనిలో చెల్లిస్తే చాలు. 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ. 55 కడితే.. ఏటా రూ. 36 వేలు వస్తాయి.

40 ఏళ్ల వయసులో ఉన్న వరు నెలకు రూ .200 చెల్లించాల్సి వుంది. నెలకు రూ. 3 వేలు వస్తాయి. 60 ఏళ్లు నిండిన తర్వాతి నుంచి మూడు వేలు వస్తాయి. నెలవారీ ఆదాయం రూ. 15 వేలకు లోపు ఉంటేనే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news