రూ.6,000 ప్రీమియం తో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ… వివరాలివే..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీలతో మనం ఎన్నో లాభాలను పొందొచ్చు. రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ ని తీసేసి రెండు కొత్త పాలసీలను LIC తీసుకు వచ్చింది. అవే ఎల్ఐసీన్యూ జీవన్ అమర్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్. ఇక మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే…


ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్:

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ ద్వారా మీరు రూ.6,000 లోపు ప్రీమియం తో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ ని పొందొచ్చు.
టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అంటే ఇది బాగుంటుంది.
అలానే ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్.
కొనసాగుతున్న సమయంలో మరణిస్తే ఈ ప్లాన్ ద్వారా కుటుంబానికి సహాయం అందుతుంది.
మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏమీ ఉండవు.
18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు దీనికి అర్హులు.
అలానే మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే ఉంటుంది.

ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ తో ఎంత వస్తుంది..?

గరిష్టంగా ఎంత డబ్బులు పెట్టైనా పాలసీ తీసుకోవచ్చు.
కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000.
పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది.
ఈ ప్లాన్ లో మీకు రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి.
20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రెగ్యులర్ ప్రీమియం ని ఎంచుకుని 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.50 లక్షలకు తీసుకుంటే ఏడాదికి రూ.5,959 చెల్లించాలి. అలానే జీఎస్‌టీ చెల్లించాలి. ఒకవేళ కనుక సింగిల్ ప్రీమియం అయితే అప్పుడు రూ.57,768 చెల్లించాలి. అలానే జీఎస్‌టీ చెల్లించాలి. 20 ఏళ్ల పాటు రూ.50 లక్షల కవరేజీ లభిస్తుంది. ఒకవేళ కనుక లిమిటెడ్ ప్రీమియం ని ఎంపిక చేస్తే రూ.7,832 చెల్లించాలి. అలానే జీఎస్‌టీ చెల్లించాలి.
అదే సింగిల్ ప్రీమియం కి రూ.1,14,187 తో పాటు జీఎస్‌టీ చెల్లించాలి. ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం కి మీ సమ్ అష్యూర్డ్ డబుల్ అయ్యి రూ.1 కోటి కవరేజీ లభిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news