తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యుత్ చార్జీల పెంపుపై కేసీఆర్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో చార్జీలను పెంచకుండా ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, పవర్ లూమ్, పౌల్ట్రీ ఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్ పై రెండు రూపాయలు రాయితీ పథకాలు, ప్రతినెల ఎస్సీ మరియు ఎస్టీల గృహాలకు 101 యూనిట్లు, క్షౌరశాలలు మరియు లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు యధావిధిగా వచ్చే ఏడాది కూడా అమలు చేస్తామని తెలిపింది.
ఈ మేరకు ప్రస్తుత రిటైల్ టారిఫ్ ను యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పంపాయి. దీంతో వచ్చే ఏడాది కరెంటు చార్జీలు పెరగబోవు అన్న మాట. ఇక కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం పై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.