కేంద్రం నుండి అదిరే స్కీమ్.. నెలకు రూ.5 వేలు పొందవచ్చు..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్రం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సామాన్య ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు వివిధ స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీములు తో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వచ్చేలా చూసుకోవడం మంచిది. జీవితం సాఫీగా సాగుతుందని చాలా మంది స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. మీరు కూడా కేంద్రం అందించే స్కీమ్స్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని చూడాల్సిందే.

అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ స్కీముని తీసుకొచ్చారు. 60 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవుతుంది. 18 ఏళ్ల వయసు ఉన్న వారి నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ స్కీము లో చేరచ్చు. ఈ స్కీము లో పెట్టుబడి పెట్టాలంటే పోస్టాఫీసు లేదా బ్యాంకు లో ఖాతా ని ఓపెన్ చెయ్యవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే వారు ఈ స్కీము కి అయితే అనర్హులు. వయసును బట్టి ఈ స్కీము లో పే చెయ్యాల్సిన అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. కనిష్టంగా రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ ని పొందవచ్చు.

18 ఏళ్ల వయసు లో చేరే వారు 60 ఏళ్లు వచ్చేంత వరకు 42 ఏళ్లు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నెలకు రూ.210 కడితే నెలకు రూ.5 వేల పెన్షన్ పొందుతారు. 40 ఏళ్ల వారు రూ.5 వేలు పొందాలనుకుంటే నెలకు రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక ప్రతీ నెలా కూడా పెన్షన్ పొందుతారు. రూ.1000, రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేలు వరకు పెన్షన్ ని ఈ స్కీము తో పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news