రూ.250 కడితే నెల నెలా చేతికి రూ.5 వేలు పొందొచ్చు… ఎలా అంటే..?

ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్రం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. దీని వలన మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ స్కీమ్‌ లో చేరితే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. పైగా పదవి విరమణ అయ్యాక ఏ ఆర్ధిక ఇబ్బందులు వుండవు. ఈ స్కీమ్ ఏ అటల్ పెన్షన్ యోజన.

అటల్ పెన్షన్ యోజన పథకం లో కనుక చేరితే ప్రతి నెలా రూ.1000 నుంచి పెన్షన్ పొందొచ్చు. రూ.5 వేలు వరకు పెన్షన్ పొందే అవకాశం వుంది. అయితే ఈ డబ్బు పొందాలంటే … మీరు నెల నెలా కొంత డబ్బు కట్టాలి. దీని ఆధారంగా మీకు పెన్షన్ లభిస్తుంది.

ఒకవేళ మీకు 20 ఏళ్ల వయసులో అయ్యి… నెలకు రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే అప్పుడు మీరు నెలకు రూ.248 కట్టాలి. తక్కువ మొత్తంతోనే అధిక పెన్షన్ పొందాలంటే తక్కువ వయసు లో ఇందులో చేరితే మంచిది.

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ డబ్బులు మాత్రం 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా మీకు వస్తాయి. ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే అప్పుడు నామినీకి ఈ డబ్బులు చెల్లిస్తారు.