మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎకౌంట్ ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి మంచి బెనిఫిట్ కలగనుంది. ముఖ్యంగా హోమ్ లోన్ తీసుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది.
ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే.. ఎస్బీఐ అందిస్తున్న ఈ హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు 6.7 శాతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదే ఒకవేళ మహిళలు కనుక హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే ఇంకా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గుతుంది.
హోమ్ లోన్ కోసం బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. కేవలం ఇంట్లో వుండే యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చెయ్యచ్చు. మరో 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గుతుంది కూడా. తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తోందని ఎస్బీఐ దేనేయితో కస్టమర్స్ మంచి లాభం పొందొచ్చు.
రేట్ల తగ్గింపు వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. ఇక వడ్డీ వివరాల లోకి వెళితే… రూ.30 లక్షల వరకు రుణ మొత్తానికి 6.7 శాతం వడ్డీ చెల్లించాలి. ఒకవేళ రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తీసుకుంటే 6.95 శాతం వడ్డీ పడుతుంది. అదే రూ.75 లక్షలకు పైన రుణానికి 7.05 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.