ఈ మహమ్మారి సమయంలో డబ్బుల్ని ఇలా పొందండి…!

-

ఇటువంటి కష్ట సమయం లో కూడా మంచిగా రాబడి పొందొచ్చు. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు ఎక్కువై పోతున్నాయి. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండాలి. పాక్షిక లాక్ డౌన్ కూడా ఇప్పుడు విధిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కానీ హెల్త్‌కేర్ రంగంపై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు. వాళ్ళకి మాత్రం కేవలం లాభమే ఉంటుంది.

ఇటువంటి కష్ట సమయమ్ లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తాజాగా కొత్త స్కీమ్ తీసుకు వస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఇదిహెల్త్‌ కేర్ ఈటీఎఫ్ స్టార్ట్ చేయనుంది. ఈ ఫండ్ స్కీమ్ ఎన్ఎఫ్‌వో మే 6న ప్రారంభమౌతుంది. ఇది 14 వరకు అందుబాటులో ఉంటుంది.

నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ ఆధారంగా ఈ ఫండ్ వర్క్ అవుతుంది. నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్‌లో దిగ్గజ హెల్త్ కేర్ కంపెనీలు కూడా ఉంటాయి. ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇందులో మీరు ఈ పెట్టే డబ్బులు ఈ హెల్త్‌ కేర్ కంపెనీల షేర్ల లోకి వెళ్తాయి.

రూ.1000 నుండి ఇందులో చేరచ్చు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల లో ఈ ఫండ్ లిస్ట్ అవుతుంది. దీనిలో డబ్బులు పెడితే హెల్త్ కేర్ రంగంలో భవిష్యత్‌లో భారీ పెరుగుదల నమోదు కావొచ్చని అంటున్నారు కనుక మంచి రాబడి కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హెల్త్ కేర్ ఫండ్‌లో డబ్బులు పెట్టవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news