విడిపోతున్నట్టు ప్రకటించిన బిల్ గేట్స్ దంపతులు…!

బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్ తో విడిపోయినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 27 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరు విడిపోతున్నట్లు మంగళవారం నాడు ట్వీట్ చేయడం జరిగింది. ఆర్థికంగా మేము ఇంకా క్లియర్ చేసుకోలేదు కానీ మేము గేట్స్ ఫౌండేషన్ లో పని చేస్తాము అన్నారు. మా రిలేషన్ షిప్ మీద చూస్తే… మొత్తానికి విడిపోవడమే మంచిదని మేము నిర్ణయించుకున్నాము.

గత 27 ఏళ్ల నుంచి ముగ్గురు పిల్లలతో ఒక ఫౌండేషన్ మొదలుపెట్టాము. మేము ఇంకా దీనిలో కలిసి పని చేస్తాము కానీ మేమిద్దరం భార్య భర్తలు కింద ఉండడం కుదరదు అది అన్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడం కి నిర్ణయం తీసుకున్నాము. బిల్ మరియు మిలిండా గేట్స్ మైక్రోసాఫ్ట్ లో కలుసుకున్నారు. మిలిండా మైక్రోసాఫ్ట్ లో మార్కెటింగ్ మేనేజర్ గా పని చేసేవారు ఈ జంటకి 1994లో వివాహమైంది.

సీఈఓ బాధ్యతల నుంచి 2008లో బిల్ గేట్స్ తప్పుకున్నారు. ఆ తరువాత ధార్మిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం ఆయన కేటాయిస్తానని ప్రకటించిన సంగతి తెలిసినదే. తర్వాత బోర్డు సభ్యత్వం నుంచి వైదొలగిన గేట్స్ కేవలం టెక్నాలజీ ఎడ్వైజర్‌ గానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

బిల్-మిలిండా గేట్స్ ఫౌండే‌షన్ మలేరియా సహా పలు ప్రాణాంతక వ్యాధులు, వ్యవసాయ పరిశోధనలు, వంటి పలు అంశాలకు గత రెండు దశాబ్దాలుగా నిధులు సమకూర్చుతూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్‌పై పోరాటానికి 250 మిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నట్టు గతేడాది ప్రకటించారు.