ఫ్యాక్ట్ చెక్: మేక పాలతో డెంగ్యూ తగ్గుతుందా..?

-

ఈమధ్య డెంగ్యూ జ్వరాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా దోమలు కుట్టకుండా డెంగ్యూ బారిన పడకుండా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే తాజాగా సోషల్ మీడియా పోస్టులో మేక పాలు తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గుతుందని ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయని ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది.

Goat Milk vs. Cow Milk: Which Is Healthier?

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాల్లో డెంగ్యూ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనితో మధ్యప్రదేశ్ ఉత్తర, ప్రదేశ్ పంజాబ్ మరియు ఢిల్లీ ప్రాంతాలలో మేక పాలు ధరలు బాగా పెరిగాయి. అయితే నిజంగా మేక పాలు తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గుతుందా…?, ప్లేట్లెట్స్ పెరుగుతాయా దీనిలో నిజం ఎంత అనేది చూస్తే..

<div class="paragraphs"><p>An archive of the post can be found <a href="https://perma.cc/XTP7-E7ZD">here</a>.</p></div>

డెంగ్యూ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. అందుకని ఆరుగురు పేషెంట్లు రోజుకీ 250 మిల్లీ లీటర్లు మేకపాలు తీసుకుంటే మంచిదని.. ఫ్రీగా వీటిని సప్లై చేస్తున్నామని ఒక వార్త కూడా వచ్చింది. అయితే మేక పాలు తీసుకోవడం వల్ల డెంగ్యూ తగ్గుతుంద అనేది చూస్తే…

డెంగ్యూ అనేది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. అయితే మేక పాలు తీసుకోవడం వల్ల డెంగ్యూ తగ్గదు అని డాక్టర్ చెప్తున్నారు. పైగా మేక పాలతో డెంగ్యూ తగ్గుతుందని ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news