SEMIFINAL RECORDS: కోహ్లీని వెంటాడుతున్న లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ బలహీనత…!

-

ఈ వరల్డ్ కప్ లో ఇండియా చాలా సునాయాసంగా సెమి ఫైనల్ కు అర్హత సాధించిందంటే అందుకు ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ అని నిస్సందేహంగా చెప్పాలి. రోహిత్ , గిల్ , కోహ్లీ , అయ్యర్ లు చాలా మ్యాచ్ లలో కీలక పరుగులు చేసి జట్టును సెమీస్ కు చేర్చారు. ఇక ఇందులో కోహ్లీది చాలా ప్రత్యేకం… అత్యధిక పరుగులతో టాప్ లో ఉన్న కోహ్లీ రెండు సెంచరీ లు చేశాడు. కాగా.. గత వరల్డ్ కప్ లలో కోహ్లీ సెమీస్ రికార్డులు ఏమంత బాగాలేవు. ఇప్పటి వరకు మూడు వరల్డ్ కప్ సెమీస్ లు ఆడిన కోహ్లీ మూడింటిలోనూ స్వల్ప స్కోర్ లకే అవుట్ అయ్యాడు. 2011 లో పాకిస్తాన్ తో కేవలం తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 2015 లో ఆస్ట్రేలియా పై ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక గత వరల్డ్ కప్ ను చూస్తే న్యూజిలాండ్ పై కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు.

అయితే కోహ్లీ అవుట్ అయిన మూడు సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం గమనార్హం. ఇప్పుడు కివీస్ లోనూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ ఉన్నాడు. మరి ఇతన్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news