తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పాచికలు పారుతాయా ?

-

మనకు పూర్వం పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతూవుంటారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని.. ఈ సామెత సరిగా మన సినీ నటుడు మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సూట్ అవుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన ను ప్రజల్లోకి తీసుకువెళుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేసి ఏదో సాధించాలని అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉండగానే మరో సాహసోపేత నిర్ణయం తీసుకుని జనసైనికులకు మరియు సీనియర్ రాజకీయ నేతలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇప్పటి వరకు పవన్ ఏపీలో ఎమ్మెల్యే గా కూడా గెలవలా ? కానీ తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని ఎన్నికల్లో నిలబెట్టడానికి తయారవుతున్నాడు. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ అధికారంలో ఉంటూ మళ్ళీ మూడవ సారి తానే గెలిచేలా ఉన్నాడు.

ఇటువంటి సమయంలో తెలంగాణాలో ఎన్నికల్లో పోటీ చేయడం కరెక్ట్ కాదంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి పవన్ ఏ పథకంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు ? దీని వెనుక ఎవరున్నారు ? అసలు పవన్ పాచికలు తెలంగాణాలో పారుతాయా ? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news