సీఎం కేసీఆర్‌ చేతిలోనే తెలంగాణ క్షేమం : మంత్రి గంగుల

-

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ నాయకులకు అధికారం అప్పగిస్తే పచ్చగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం పలు డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఉదయం కరీంనగర్‌ మండలంలోని మొగ్దుంపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌’ పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

Gangula Kamalakar: The center is like a buffalo – NTV – 2Telugustates

అనంతరం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ సంపాదన ఆంధ్రా పాలకులు దోచుకున్నారే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారికి రాలేదని అన్నారు. ఇప్పుడు పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు మళ్లీ హైదరాబాద్‌లో పాగా వేస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలిపేందుకు బీజేపీ ముసుగులో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముసుగులో కేవీపీ, షర్మిల తెలంగాణలోకి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా మన కేసీఆర్‌ను ఓడగొట్టి తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ లో తన వ్యక్తిగత కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనంతుల రమేష్ గాయపడగా బిజీ షెడ్యూల్లో సైతం తన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు మంత్రి గంగుల కమలాకర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పీఆర్వో రమేష్ మాట్లాడుతూ… మంత్రికి ప్రజలపై ఉండే ప్రేమను ఆయన వెనకాల ఉండి ప్రతిరోజు చూస్తానని, ఈరోజు స్వయంగా అనుభూతి చెందానన్నారు. గాయం నుండి త్వరగా కోలుకోవడానికి ఆయన ఓదార్పు ఎంతో స్వాంతన ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో కుటుంబ సభ్యులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, బీఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, కుర్ర తిరుపతి ఎడ్ల సరిత అశోక్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news