బీపీ, ఘగర్, ధైరయిడ్, ఓబిసిటీ ఇవన్నీ ఒకప్పుడు ఎవరికో ఉంటే మనం చెప్పుకునే వాళ్లం… వాటిని అప్పట్లో ప్రణాంతక వ్యాధుల్లా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు మన పిన్నికో, అమ్మకో, బాబ్భైకో ఇవి వచ్చేశాయి..మన కుటంబంలోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధులబారినపడినవారు ఉన్నారు. 2020 సంవత్సరంలో దాదాపు 15 శాతం మంది హైబీపీ బారిన పడినట్లు అధ్యయనాల్లో తేలింది.
4 సంవత్సరాలలో బీపీ బారిన పడినవారి సంఖ్య బాగా పెరిగిందట. 35 శాతం మంది కుటుంబాల్లో ఈ సమస్య తాండవం చేస్తుంది. ఇలా బీపీ, ఘగర్ వచ్చినవాళ్లు చాలా జగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో శ్రద్ధ.. వహించాలి. ఇది తినోద్దు..అని తినాలి అంటూ అందరూ ఏవేవో చెప్తేస్తూ ఉంటారు. పాపం వాళ్లకు అన్ని భయంగానే అనిపిస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మైనే శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధంచారు. ఇందులో రక్తపోటు, గుండె సంబంధిత ప్రమాదకారకారలపై పెరుగు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని తేలింది.. ఇందులో అధిక బీపీ ఉన్నవారిలో రోజూ వారీ పెరుగు వినియోగం బీపీని తగ్గించడంలో సహయపడుతుందని నిపుణులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీంతో వారికి CVD, గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. CVD ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. అమెరికాలో ప్రతి 36 సెకన్లకు ఒకరు CVDతో మరణిస్తున్నారంటే పరస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరే ఆలోచించండి.. అలాగే ఆస్ట్రేలియాలో ఇది ప్రతి 12 నిమిషాలకు ఒక మరణం చోటు చేసుకుంటుంది.
పాల ఆహారం.. పెరుగు బీపీని తగ్గిస్తుందని.. పాల ఉత్పత్తులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక సూక్షపోషకాలు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. రక్తపోటును తగ్గించే బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని పెరుగు మరింత ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడైంది.. పెరుగు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో రక్తపోటు.. పెరుగు తినని వారి కంటే 7 పాయింట్లు తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.
అవును చాలా మందికి..పెరుగు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆ వాసనంటేనే వాంతులు చేసుకుంటారం. కానీ పెరుగుని రోజు తినకపోయినా కనీసం వారానికి ఒకసారైనా తినటానికి ట్రై చేస్తూ ఉండండి.