పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే నిజంగానే పాయిజన్ అవుతుందా?

-

తినే ఆహారంలో ఇంట్లో వాళ్లు కొన్నింటిని కలుపుకుని వండొద్దు తినొద్దు అంటుంటారు..అలాంటివాటిల్లో మొదటిది పొట్లకాయ, గుడ్డు కలిపి తినకూడదు, కలిపి వండొద్దు అంటుంటారు. మనం కూడా ఎప్పుడూ వీటిని కలిపి తింటానికి సాహసం చేయం..అసలు నిజంగానే వీటిని కలిపితినకూడదు. ఈ విషయం పై క్లారిటీ తెలుసుకుందాం.

పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుంది అంటారు కానీ.. అది పూర్తి వాస్తవం కాదు. ఇలా కలిపి తినడం వల్ల కొందరికి మాత్రమే ప్రాబ్లమ్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు. అవును.. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ కాంబినేషన్‌కు సాధ్యమైనంత దూరం ఉండటం మంచింది. ఏదైనా మిక్స్ చేసి కూర వండుతున్నప్పడు.. అవి రెండు ఒకే సమయంలో జీర్ణమయ్యేవి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే పొట్లకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది… దీంతో ఇది కొద్ది సమయంలోనే అది అరిగిపోతుంది.

కానీ కోడిగుడ్డులో చాలారకాల ప్రొటీన్స్, పోషకాలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో గుడ్డు జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. దీనివల్ల గుడ్డు, పొట్లకాయ కలిపి వండి, తింటే జీర్ణమయ్యే సమయాల్లో తేడా ఉంటుంది. అలాంటప్పుడు కొందరికి గ్యాస్, కడుపులో మంట, ఏసీడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అందరికీ ఎదురవుతుందని చెప్పలేం. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారికి ఎలా తిన్నా కూడా సమస్య ఉండదు.

నిజానికి..చపాతి, అన్నం కూడా కలిపి తినకూడదు..కానీ చాలమంది ఈ రెండింటి కాంబినేషన్ తింటుంటారు. రాత్రి రెండు చపాతీలు, కొంచెం అన్నం తింటారు. కానీ ఈ రెండు కలిపి తినకూడదు అంటున్నారు..ఆరోగ్య నిపుణులు. ఇవి అరిగే టైంలో కూడా తేడా ఉంటుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు సూచనల ఆధారంగానే ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆహారం అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news