ఇంట్లో నుంచే ఖాతా ట్రాన్స్‌ఫర్ ఇలా చెయ్యచ్చు తెలుసా…?

మీరు మీ ఖాతాని ఒక బ్రాంచ్ నుండి మరో బ్రాంచ్ కి మార్చాలని అనుకుంటున్నారా…? అయితే మీకు చాలా సులువు. ఎక్కడకి వెళ్ళక్కర్లేదు ఇంట్లో నుండే ఒక బ్రాంచ్ నుండి మరో బ్రాంచ్ కి వెళ్ళచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లోనే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఒకటి వుంది.

ఎకౌంట్ ని మార్చుకోవడానికి వెళ్లాల్సిన పని లేదు. యోనో ఎస్‌బీఐ, యోనో లైట్, ఆన్‌లైన్ ఎస్‌బీఐ ద్వారా అకౌంట్‌ను ఆన్‌లైన్‌ లోనే సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకో వచ్చు. అయితే మీరు కనుక మార్చుకోవాలి అంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ వద్దనే ఉండాలి.

దాని ఆధారణంగా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓవేళ లేదు అంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కుదరదు గమనించండి.ఎకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మొదట ఎస్‌బీఐ యోనో యాప్ వాడుతూ ఉంటే మీరు సర్వీసెస్ అనే ఆప్షన్‌ లోకి వెళ్లి….

బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటే.. అప్పుడు ఇసర్వీసెస్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మీరు ఎకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.