ఆవు మూత్రం తాగా… కరోనా తగ్గింది: ఎమ్మెల్యే

యూపీ: కరోనాకు సొంతం వైద్యం వద్దని వైద్యులు చెబుతుంటే కొంతమంది వినడంలేదు. సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆసత్రులకు వెళ్లకుండా కరోనా నుంచి కోలుకుంటున్నారు. అటువంటివారిలో ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. తనకు కరోనా సోకడంతో  సొంత వైద్యం చేసుకున్నారు. అలా కరోనా నుంచి బయటపడ్డారు.

విషయమేంటంటే… ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తనకు కరోనా వచ్చిందని, ఇందుకు తాను గోవు మూత్రం తాగానని చెప్పారు. అలా తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. ఆవు మూత్రమే తనను రక్షించిందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా వస్తే ఆవు మూత్రాన్ని ఎలా వినియోగించాలనేది వివరించారు. అయితే ఎమ్మెల్యే సూచనను కొందరు వ్యతిరేకిస్తున్నారు. కరోనా వస్తే కచ్చితంగా వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు.