జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం శరవేగంగా పరిణామాలు మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అయితే సాధారణంగా ఎన్నికలు అంటే ప్రచారం ఒక రేంజ్ లో ఉంటుంది కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కఠిన ఆంక్షలు మధ్య ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించి ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి కార్యాలయం ముందు లలిత్ బాగ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య యత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రచారంలో భాగంగా పర్యటనలు పాదయాత్రలకు పోలీసులు అనుమతించడం లేదు అంటూ ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. జిహెచ్ఎంసి కార్యాలయం ముందు మహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ ఒంటిపై పెట్రోలు చూసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతని నివారించారు. ప్రచారం నిర్వహిస్తామంటే పోలీసులు సహకరించడం లేదని ఆరోపించారు.