సిఎం ఇంటి దగ్గరలో చాక్లెట్ లో గంజాయి…!

-

యువతే లక్ష్యం గా చేసుకుని గంజాయి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. చాక్లెట్స్, టాబ్లెట్స్ రూపంలో వీటిని అమ్మే స్తున్నాయి. ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థులు టాబ్లెట్స్ వాడకంతో ఈ దందా గురించి వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. కాలేజ్ విద్యార్థులు,యువతే లక్ష్యం గా ఈ గ్యాంగ్లు గంజాయి అమ్మేస్తున్నారు.

కార్పొరేట్ కాలేజీ ల్లో విద్యార్థులు టెక్నాలజీ పేరుతో వాట్సప్, టేలీగ్రాం యాప్ ల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని మత్తులో తూగుతున్నారు. ఇది గంజాయి సప్లై చేసేవారికి మంచి ఉపాధి గా మారింది. మంగళగిరి పరిధిలో నే 13 కేసులు నమోదు ఐయ్యాయి. దీంతో పోలీసులు కాలేజీ విద్యా ర్థుల మీద నిఘా పెంచారు. దీనితో విద్యార్థులు రూటు మార్చారు. చాక్లెట్స్ రూపంలో గంజాయి అమ్ముతున్నారు

ఇంకా కొంత మంది టాబ్లెట్స్, వైట్ నర్ రూపంలో మత్తులో తూగు తున్నారు. కొద్ది కాలంగా వీటి వాడకం విపరీతంగా పెరిగింది. పోలీసులు ఎన్ని సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా లాభం లేక పోయింది. ఎక్సైజ్ శాఖ దీని గురించి అవగాహనా సదస్సులు నిర్వహించినా యువత మాత్రం మత్తు ఇచ్చే కిక్ లోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలోనే ఈ వ్యవహారం జరుగుతుంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news