మనుషులను చంపి వారి భాగాలతో వెరైటీ వంటకాలు చేసుకుని తిన్న రాక్షస జంట..30 మంది బలి

-

ఎవరైనా చికెన్, మటన్ తింటారు..కానీ ఈ జంట ఏకంగా మనుషులను చంపి వారి భాగాలతో రకరకాల వంటలు వండుకుని తింటుందట. దాదాపు 20 ఏళ్లుగా 30 మందిని చంపి తిన్నారంట. ఈ ఘటన రష్యాలోని కాస్పోదర నగరంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..
రష్యాలోని క్రాస్నొదర నగరంలో నివాసముంటున్న దిమిత్రీ బక్షీవ్(35), అతని భార్య నతాలియా(42) 20 సంవత్సరాలుగా దాదాపు 30 మందిని చంపి, శరీర భాగాలను కట్ చేసి ఫ్రిడ్జ్ లో దాచుకొని తినేవారు.

ఎలా బయటపడింది..

ఒక రోజు భవన నిర్మాణ కార్మికుడు రోడ్డుపై వెళ్తుండగా.. అతడికి ఒక సెల్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ లో ఉన్న ఫోటోస్ చూడగానే అతనికి దిమ్మతిరిగి పోయింది. పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ లో దిమిత్రీ బక్షీవ్ మానవ శరీర భాగాలను నోట్లో పెట్టుకొని తింటున్నట్టు ఉన్న ఆ ఫోటోను చూసిన పోలీసులకు ఫీజులు ఎగిరిపోయాయ్.
పోలీసులు వీరి అపార్ట్మెంట్ లో తనిఖీ చేశారు..అక్కడ పోలీసులకు దిమ్మతిరిగే  నిజాలు బయటపడ్డాయి. వారి ఇంట్లో మానవ శరీర భాగాలు, ఫ్రిజ్జ్ లో దాచిన మనిషి మాంసం, మనిషి మాంసంతో వండిన వంటకాలు దొరికాయి. ఇంటి చుట్టూ ఉన్న ప్రాణంగంలో, బేస్మెంట్ లో మానవ శరీర భాగాలు దొరికాయి.ఈ రాక్షస జంట మనుషులను చంపటమే కాదు..వివిధ రకాల డిష్లు తయారు చేసేవారని పోలీసుల విచారణలో తేలింది.

మనుషులను ఎలా ట్రాప్ చేస్తారో తెలుసా

డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని రోజులకి డిన్నర్, డేటింగ్ అని చెప్పి ఇంటికి పిలిపించుకుంటారు. తినేవాటిలో  మత్తు పదార్థాలు కలిపి పెడతారు. స్పృహ కోల్పయాక వారిని చంపి, ముక్కలు, ముక్కలుగా నరికి, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకుంటారు.

పేరుకు 30 మందిని అయినా కనిపెట్టింది ఒక్కరినే

దక్షిణ రష్యాలోని క్రాస్నోడార్‌కు చెందిన ఈ జంట చేసిన ఒక హత్యను మాత్రమే అధికారులు నిర్ధారించగలిగారు. పోలీసులు వీరిని మొదట అడిగినప్పుడు పిట్టకథ చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. ఒక మహిళ మృతదేహం చూసాము… ఆమె శరీర భాగాలతో సెల్ఫీ తీసుకున్నామని చెప్పారు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా జరిగింది చెప్పారు. వీరిద్దరూ కలిసి “1999 నుండి కనీసం 30 మంది బాధితులను వేటాడి, కిడ్నాప్ చేసి, చంపి తిన్నట్లు ఒప్పుకున్నారు.
ఈ వార్తను చదువుతుంటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. వీళ్లేంట్రాబాబు మనుషులును చంపి తిన్నారేంట్రా అనిపిస్తుంది కదా..డేటింగ్ యాప్ మోజలో పడి ఎవ్వర్ని పడితే వారిని నమ్మకండి.. ముక్కూమొఖం తెలియని వారిని కలిసేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మన దగ్గర అలాంటి వారు ఉండరులే అనుకుంటారామే..చంపితినకపోవచ్చు..కానీ ఇంకేదైనా చేసే అవకాశం ఉందికదా..!

Read more RELATED
Recommended to you

Latest news